పండగ వాతావరణంలో గ్రామసభ నిర్వహించాలి
KMM: పండగ వాతావరణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ గ్రామసభ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గ్రామసభ నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్‌లు డాక్టర్ పి శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు.