ఇద్దరు బడా రియల్టర్లు అరెస్ట్
ADB: ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేయడానికి యత్నించిన ఇద్దరు రియల్టర్లను అరెస్టు చేశామని ADB DSP జీవన్ రెడ్డి సోమవారం తెలిపారు. ఇటీవల కాలంలో ఇద్దరు రియల్టర్లు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ నకిలీ పత్రాలు తయారు చేసి భూమిని ఇతరుల పేర్లపై మార్పు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు.