విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

SRPT: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో పాడి గేదె మృతి చెందిన ఘటన శుక్రవారం మునగాల మండలం వెంకటరాంపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంగరి గోవర్ధన్ ఒక పాడి గేదెను రోజు మాదిరిగా మేతకు తన పొలానికి తీసుకువెళ్లగా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. గేదె విలువ 50 వేల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.