ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

కృష్ణా: ఆక్వా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. నందివాడ గ్రామంలోని ఆక్వా చెరువులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ శుక్రవారం సందర్శించి, ఆక్వా రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఆన్‌లైన్‌లో ఒక్కొక్క దరఖాస్తు చేయడానికి ఎంత సమయం పడుతుందన్న అంశాన్ని అధికారులు ఆచరణాత్మకంగా చేసి చూపించారు.