దసరా సందర్భంగా జమ్మి కార్యక్రమానికి కదిలిన ఊరు
నారాయణపేట: గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామంలో దసరా పండుగ సందర్భంగా గ్రామస్తులంతా జమ్మి కార్యక్రమానికి ఊరంతా కలిసి హాజరు కావడం అనాదిగా వస్తోంది. నేడు గ్రామంలో నిర్వహించిన జమ్మి కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఒకరికి ఒకరు జమ్మి పెట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాత సంప్రదాయాన్ని కాపాడతామని గ్రామస్తులు పేర్కొన్నారు.