VIDEO: అచ్యుతాపురం SEZలో కార్డాన్ సెర్చ్
AKP: ఎస్పీ ఆదేశాల మేరకు పరవాడ డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం SEZ పరిధిలో శనివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. నాయనమ్మపాలెం, గురజాపాలెం, దిబ్బపాలెం ప్రాంతాల్లో ఇళ్లు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డులు లేని 16 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.