VIDEO: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

VZM: ఎస్.కోట స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి దేవి కూడలి వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం రక్షాబంధన్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ యువతీ, యువకులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళపై జరుగుతున్న దాడులను అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా చట్టాలను పటిష్టం చేయాలని నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.