VIDEO: జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం
కృష్ణా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గుడివాడ గురురాజు గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్‌లో "జలం - జీవం" అనే నినాదంతో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ప్రజలకు, హాస్పిటల్ సిబ్బందికి జల సంరక్షణ ప్రజా జీవనంలో ఎంతో ముఖ్యమైనదని తెలియజేస్తూ, ర్యాలీ నిర్వహించామని డా. జగదీశ్వరరావు అన్నారు.