బనగానపల్లెలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం పర్యటించారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. త్వరలోనే అన్ని గ్రామాలలో పర్యటిస్తానని ఆయన అన్నారు.