ఓవర్ స్పీడ్ వెళ్తున్నారా.. జాగ్రత్త..!

KNR: వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దని పోలీసులు సూచిస్తున్నారు. KNR- HYD రాజీవ్ హైవేపై గురువారం స్పీడ్ గన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తిమ్మాపూర్ CI సదన్ కుమార్ తెలిపారు. ఇది ఈ మార్గంలో ఓవర్ స్పీడ్‌గా వెళ్లే వాహనాల వేగ పరిమితిని ఇట్టే గుర్తు పట్టేస్తుందన్నారు. తద్వారా ఆయా వాహనాలపై జరిమానాలు విదించడం జరుగుదుందన్నారు.