పాక్‌లో మరోసారి ఆత్మాహుతి దాడులు
పాక్ పెషావర్ వద్ద ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. రెండు శక్తిమంతమైన పేలుళ్లు జరిగగా.. ఒకటి కార్యాలయం గేటు వద్ద, మరొకటి బైక్ పార్కింగ్ వద్ద జరిగినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. దాడి అనంతరం ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.