మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్
MDK: చిన్నశంకరంపేట జడ్పీ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏర్పాట్లను తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈ సందర్భంగా వంట నిర్వాహణకు వాడుతున్న వంట సామాగ్రిని తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తహసీల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దీపారాథోడ్ పాల్గొన్నారు.