'సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ'

'సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ'

WNP: పానగల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ గురువారం పంపిణీ చేశారు. గ్రామంలోని 15 మందికి రూ. 2 లక్షల 93 వేలు విలువైన చెక్కులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. నిరుపేదలు వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయ రాములు, తదితరులు పాల్గొన్నారు.