CPRపై శిక్షణ కార్యక్రమం
SRD: బొల్లారం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం CPRపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ మహేష్, రంగారావు, పరమేశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో పోలీస్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించే విధానాలపై అవగాహన కల్పించారు. హృదయ ఆపత్కాలంలో సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.