కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్సై సతీష్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కొంతమంది భద్రాచలంలోని ప్రధాన రహదారిలోని ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారితో కలిసి తనిఖీ చేయగా, కల్తీ నెయ్యి డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు.