సోషల్ మీడియాలో రెచ్చగొడితే కఠిన చర్యలు!

సోషల్ మీడియాలో రెచ్చగొడితే కఠిన చర్యలు!

SRPT: ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో వర్గ వైషమ్యాలకు తావిచ్చేలా పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని గరిడేపల్లి ఎస్సై చలికంటి నరేష్ ఈరోజు హెచ్చరించారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తులతో పాటు, ఆయా వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మండల ప్రజలంతా శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు.