లింపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు
SKLM: కోటబొమ్మాళి మండలం కురుడు, చౌదరి కొత్తూరు, కురుడు కాలనీ, నిమ్మాడ గ్రామాలలో మంగళవారం 413 పశువులకు లింపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేసారు. స్థానిక పశు వైద్య శాఖ అధికారి లక్కీనాన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు తగు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో కల అన్ని గ్రామాలలో రైతు సేవా కేంద్రాల్లో 12000 డోసులు సిద్ధంగా ఉన్నాయన్నారు.