CM పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: DSP

CM పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: DSP

ADB: CM రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రేపు ఉదయం 9 నుంచి సభ పూర్తయింతవరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరగనుందని DSP జీవన్ రెడ్డి ఇవాళ తెలియజేశారు. ఇచ్చోడ నుంచి పిప్పిరి గ్రామం వరకు సభకు పోయేవారికి వన్ వే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సభకు వచ్చే వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్కింగ్ స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని DSP జీవన్ రెడ్డి సూచించారు.