యువకులు క్రీడల్లో రాణించాలి: MLA అనిల్ జాదవ్
ADB: యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీనివాస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు. వేసవికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు.