పీఎంఏవై గడువు పెంపు: జాయింట్ కలెక్టర్
ప్రకాశం: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాలో ఇళ్ళు లేని నిరు పేదల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇళ్ళు లేని నిరుపేదలు తమ దగ్గరలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.