VIDEO: మహిళపై కత్తితో దాడి.. పోలీసులకి అప్పగింత
ప్రకాశం: కనిగిరిలో సుబ్బులు అనే మహిళను కత్తితో గాయపరిచిన శివ అనే వ్యక్తిని స్థానిక టీడీపీ నాయకుడు ఫిరోజ్ పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. స్థానిక సాయిబాబా థియేటర్ దగ్గర ఉన్న సుబ్బులు అనే మహిళను అదే ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తి దుర్భాషలాడి కత్తితో గాయపరిచాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఫిరోజ్ అతని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాడు.