పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం హుండీ లెక్కింపు
VKB: కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం ఆలయ హుండీని లెక్కించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 6,91,523 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ. 1,21,279 అధికం, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛైర్మన్ వెంకటేష్, సర్పంచ్ చంద్రయ్య పాల్గొన్నారు.