'సెవెన్ సీటర్ ఆటోలకు అనుమతి లేదు'

KRNL: కర్నూలు నగరంలోని సెవెన్ సీటర్ ఆటోల రాకను నిలిపివేసినట్లు ఆదివారం కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు. డ్రైవర్లు ఈ విషయం గమనించాలన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చేవారు కర్నూలు శివారులోని నంద్యాల చెక్ పోస్ట్, గుత్తి పెట్రోల్ బంక్, బళ్లారి చౌరస్తా సెంట్ జోసఫ్ కాలేజీలో నిలుపుకోవాలని సూచించారు.