డాబా గార్డెన్స్‌లో తవ్వకాలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

డాబా గార్డెన్స్‌లో తవ్వకాలు.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

VSP: డాబా గార్డెన్స్ సెంటర్ పాయింట్ వద్ద 20 రోజులుగా కాలువ పనుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ అన్నారు. నడవడానికి, ఇళ్లకు వెళ్లడానికీ కష్టమని, రాత్రివేళ ప్రమాదం ఉందన్నారు. పన్నులు పెంచుతూ, అభివృద్ధి లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్యాయమని విమర్శించారు. వెంటనే పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.