‘మధుమేహ బాధితులకు మిషన్ దృష్టి వరం'
WNP: పెబ్బేరు పట్టణంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ముందస్తుగా కంటి సమస్యలను గుర్తించి, చికిత్స అందించేందుకు గాను మిషన్ దృష్టి కార్యక్రమం నిర్వహించారు. రెండో వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పుర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు, పుర సిబ్బంది మధుమేహ బాధితులను గుర్తించి, శిబిరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.