చైనా ఆయుధాల దిగుమతిలో పాక్ రికార్డు
పాకిస్తాన్ తన ఆయుధ అవసరాల కోసం 80 శాతం చైనాపైనే ఆధారపడుతోంది. ఈ విషయాన్ని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (SIPRI) తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆయుధ దిగుమతిదారుల్లో పాక్ పదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. మన దేశంతో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా పాక్ తన సైనిక శక్తిని ఇలా పెంచుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.