గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్..!

గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్..!

HYD: బాగ్ అంబర్‌పేట్ శారదానగర్‌లో గంజాయి అమ్ముతున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు విక్రయాలు జరుపుతుండగా పోలీసులను చూసి ఒకరు పరారయ్యారని, మిగిలిన ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని నిందితులను పీఎస్‌కు తరలించామన్నారు.