రామానుజాపురంలో విద్యుత్ స్తంభంపై పిడుగు

BHPL: వెంకటాపూర్ మండలం రామానుజాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గుంటూరుపల్లి మున్నూరు కాపు కాలనీలో గల విద్యుత్ స్తంభంపై ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడింది. దీంతో స్తంభంపై ఉన్న విద్యుత్ తీగలు కాలిపోయాయి. పిడుగుపాటుతో ఒక్కసారిగా గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. పిడుగులతోపాటు గ్రామంలో ఉరుములు మెరుపులతో స్వల్పంగా వర్షం కురిసింది.