సందడిగా ఆగమన్ కార్యక్రమం

HYD: ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి భక్తులకు అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం గణపతి వద్ద ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాణసంచా, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తి కార్యక్రమాలతో సందడి వాతావరణం నెలకొంది. అదే విధంగా గణపతి వద్ద 600మంది పోలీసులతో బందోబస్త్, 60 CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సైఫాబాద్ ACP సంజయ్ కుమార్ వివరించారు.