కాణిపాకం ఆలయానికి భారీగా ఆదాయం
AP: కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం హుండీని లెక్కించారు. 30 రోజులకు గానూ నగదు రూపంలో రూ.1,90,12,047 ఆదాయం వచ్చినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. నగదుతో పాటు 87 గ్రాముల బంగారం, కిలో 100 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారు. వీటితో పాటు గోసంరక్షణ హుండీ ద్వారా రూ.18,926, నిత్య అన్నదానం హుండీ రూ.1,79,966 ఆదాయం సమకూరింది. అలాగే విదేశీ కరెన్సీ వచ్చినట్లు పేర్కొన్నారు.