పాడిరైతుల డిమాండ్ల సాధనకు 24న చలో విశాఖ డెయిరీ

పాడిరైతుల డిమాండ్ల సాధనకు 24న చలో విశాఖ డెయిరీ

VZM: పాడిరైతుల డిమాండ్ల సాధనకు ఈనెల 24న ఆంధ్రప్రదేశ్ పాలరైతుల సంఘం (ఎ.ఐ.కె.ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని పాడిరైతులు విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు, పాలరైతుల సంఘం జిల్లా కార్యదర్శి గొంప క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో మండలంలోని నిమ్మలపాలెంలో పోస్టర్ విడుదల చేశారు.