నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్
HYD: ఐఎస్ సదన్ డివిజన్‌లోని సరస్వతి నగర్ కాలనీలో రూ. 9.72 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జంగం మధుకర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అమర్నాథ్ రెడ్డి కాలనీ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీవాస్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.