'నకిలీ ఉద్యోగాలతో మోసం చేసిన నిందితుడి అరెస్టు'

'నకిలీ ఉద్యోగాలతో మోసం చేసిన నిందితుడి అరెస్టు'

ADB: నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన నిందితుడు వాగ్మారే రాజరత్నను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు. బాధితురాలు జాధవ్ రమాబాయి ఫిర్యాదు మేరకు ఫిర్యాదుతో మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.