'అక్టోబర్ 2న మాంసాహార విక్రయాలపై నిషేధం’
NGKL: గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన పురపాలక సంఘం పరిధిలోని చికెన్, మటన్ సహా అన్ని రకాల మాంసాహార విక్రయాలపై నిషేధం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి నిన్న తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.