'గిరి ప్రదక్షణ విజయవంతం చేయాలి'
ప్రకాశం: సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ఏప్రిల్ 2న నిర్వహించనున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ఛైర్మన్ శ్రీనివాసుల నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన ఆలయ అధికారులతో కలిసి గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.