ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

BHNG: బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయడంతో పాటు లారీ లోడింగ్ చేసి రైస్ మిల్లుకు పంపాలని సూచించారు. కేంద్రం వద్ద రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు.