తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

NLG: తమ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారులను సోమవారం హాలియా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు గుర్తింపు కార్డులు, రూ.25 వేల పింఛను, 250 గజాల ఇళ్ల స్థలాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అరెస్టులను నాయకుడు వర్ర వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు.