భీమన్న ఆలయంలో ఘనంగా దీపోత్సవం
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో ఆలయ ఈఈ రాజేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్తీకమాసం సందర్భంగా మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు, సేవా సమితి సభ్యులు పరమేశ్వరుని లింగ రూపంలో దీపాలు వెలిగించారు. సుహాసినిలకు ఆలయ సిబ్బంది కుంకుమ, అక్షతలు, గాజులు అందజేశారు.