'ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి'
KNR: ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇవాళ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ (రెవెన్యూ), అశ్విని తానాజీ వాకడే (స్థానిక సంస్థలు), డీఆర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి 339 దరఖాస్తులు స్వీకరించారు.