'అయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చు'
NZB: ఆయిల్ ఫామ్ పంట సాగు వల్ల అధిక లాభాలను పొందవచ్చునని హార్టికల్చర్ ఆఫీసర్ వాహిద్ అన్నారు. కోటగిరి మండలం అడ్కాస్ పల్లి గ్రామంలో శుక్రవారం ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట మిగతా పంటలతో పోల్చుకుంటే వ్యయం తక్కువగా ఉంటుందని, ఆదాయం ఎక్కువ వస్తుందన్నారు. చీడ పీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు.