నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కరీంనగర్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. ఉజ్వల పార్క్ ఫీడర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా మెయిన్ రోడ్ కమాన్ ఏరియా, గణేష్ నగర్ ఏరియా, కిషోర్ ఆటో స్టోర్ ఏరియా, విశాల్ మార్ట్ ఏరియాలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.