యంత్ర పరికరాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని రైతులకు యంత్ర పరికరాలు, స్పేయర్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పొగాకు పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.