పెనుగొలనులో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం
NTR: గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామ శిరిడి సాయిబాబా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం జరిగింది. అక్టోబర్ 31న భారత మాజీ ప్రధాని వల్లభాయ్ పటేల్ జయంతి రోజు కావడంతో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 560 పైగా స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్‌ది ముఖ్యపాత్రగా పలువురు పేర్కొన్నారు.