జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
సత్యసాయి: ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో హిందూపురం ఎంపీ పార్థసారథి హాజరయ్యారు. సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి కింజరపు రామ్మోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజుకు మరెన్నో జరుపుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు.