పామర్రు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

పామర్రు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వరల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రకటనను విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు పామర్రు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని పేర్కొంది. ఈ సందర్భంగా నియోజకవర్గ కుటమి నాయకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.