డెలివరీ బాయ్స్‌పై పడిన యుద్ధం ఎఫెక్ట్
కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్విగ్గీ, జొమాటో, పలు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో సుమారు 6,500 మంది గ్రిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. అయితే, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వీరిపై పడింది. వాణిజ్య గ్యాస్ కొరత వల్ల కొన్ని హోటళ్లు మూతపడగా, మరికొన్ని రేట్లు పెంచాయి. ఇదిలా ఉంటే ఆదాయం తగ్గిందని, తమను దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు డెలివరీ ఛార్జీలను పెంచాలని డెలివరీ బాయ్స్ కోరుతున్నారు.