'పండగల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు'
VZM: రానున్న పండగల నేపథ్యంలో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో కోడిపందేలు, గుల్లాట,పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఎస్.కోట పట్టణ సీఐ నారాయణమూర్తి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాటిని నివారించడానికి నాలుగు ప్రత్యేక బృందాలు నిరంతరం గ్రామాల్లో సివిల్ డ్రెస్సులో తిరుగుతారని తెలిపారు. వారికి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.