కళావైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం

MLG: జిల్లాలో కాకతీయుల కళావైభవానికి ప్రతీక రామప్ప దేవాలయం. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడంతో రామప్ప కీర్తి మరోసారి మార్మోగింది. 1213 లో కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. మంగళవారం రూ.2.61 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేశారు.