విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్
ASF: వాంకిడిలోని ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాల ప్రహరీ గోడ పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ విద్యార్థినులకు ప్రాణసంకటంగా మారింది. అధికారులు గద్దె నిర్మించి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థినులు తిరిగే ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే కంచె ఏర్పాటు చేయాలన్నారు.