జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..!
MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.1, సదాశివపేట 7.9, న్యాల్కల్ 8.0, మెదక్ జిల్లా నర్లాపూర్, సర్ధాన, వాడి 9.3, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డి పేట 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు.